ఇద్దర అమ్మాయిలను చూసినా నన్నే కావాలన్నారు...: కామ్నా రనవత్‌

బుధవారం, 13 జులై 2016 (14:36 IST)
చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో కూడిపూడి, భరతనాట్యం నేర్చుకుని నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరికతో ఈ రంగంలోకి వచ్చాననికామ్నా రనవత్‌ తెలియజేస్తుంది. అల్లరి నరేష్‌తో 'సెల్ఫీరాజా'లో నటించింది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి వివరిస్తూ... ఏదనుకుంటే అది వెంటనే జరిగిపోవాలనుకునే తత్త్వంగల పాత్ర నాది. చాలా గారాబంగా పెరుగుతాను. అయినా.. కుటుంబ సంబంధాలకు పెద్దపీట వేస్తాను. అలాంటి నా జీవితంలోకి రాజా వచ్చాక ఎటువంటి మార్పులు జరిగాయనేది కథ. 
 
అల్లరి నరేష్‌తో తొలిసారిగా నటించాను. తను తెలుగు డైలాగ్స్‌ను అర్థంచేసుకునే విధానం.. చక్కగా వివరించారు. త్వరలో పూర్తిగా తెలుగు నేర్చుకుంటాను. అరుణాచల్‌ప్రదేశ్‌ సిమాల్లలో పుట్టి, పంజాబ్‌లో పెరిగి.. ప్రస్తుతం ముంబైలో వున్న నాకు.. ఓ ఫొటోగ్రాఫర్‌ ఫోన్‌చేసి.. తెలుగులో ఓ సినిమాలో పాత్ర కోసం ఆడిషన్‌ జరుగుతుందని చెప్పడం.. నేను వెళ్ళి కలవడం జరిగింది. అప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఎంపిక చేసుకున్నా... నన్ను చూసి.. ఆడిషన్‌ చేశాక.. ఆ మరుసటిరోజే ఫైనల్‌ చేశారు. 
 
కామెడీ నటుడిగా పేరున్న నరేష్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా వుందని చెప్పింది. తన కుటుంబంలోని మూడు తరాలవారు ఆర్మీనేపథ్యం అయినా.. తనకు చిన్నతనంనుంచే నటి అవ్వాలని కోరిక వుండేదనీ.. హిందీ, పంజాబీ భాషల చిత్రాలను అధికంగా చూస్తుంటాననీ.. పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి