బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రైతుల ఆందోళనపై అమెరికా సింగర్ రిహానా స్పందించింది. రైతుల ఆందోళనకు సంబంధించిన ఓ వార్తను పోస్ట్ చేస్తూ.. మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని రిహానా ట్వీట్ చేసింది.