సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు నమోదైంది. ట్విట్టర్ ద్వారా ఓ బాధితుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కరాటే కళ్యాణి బాధితుల్లో తాము కూడా ఒకరమని.. ఓ ఇంటి కొనుగోలు విషయంలో తమ నుంచి రూ.3.5లక్షలు వసూలు చేసి తమతో ఒప్పందం చేసుకున్నట్లు బాధితుడు గోపికృష్ణ ట్విట్టర్ ద్వారా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కరాటే కళ్యాణి పురుగులు మందు తాగిన వీడియో పంపి భయభ్రాంతులకు గురిచేసిందని చెప్పాడు.
కరాటే కళ్యాణి యు ట్యూబర్ శ్రీకాంత్ పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 323, 506, 509 ప్రకారం.. పోలీసులు కేసు నమోదు చేశారు.
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి.. కరాటే కళ్యాణిపై చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 323, 448, 506 సెక్షన్ల ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.