టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉత్తరాది భామలు... వారి అందచందాలే! ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన ఐటెంగర్ల్ కైరాదత్. 'రేసుగుర్రం'లో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కైరా 'పైసావసూల్'లో తన ఆటతో కుర్రకారుతో విజిల్స్ వేయించింది. ఈమె తాజాగా తన మనసులోని మాటను వెల్లడిస్తూ,
ఉత్తరాదిన బోల్డ్ క్యారక్టర్లు చేశాను. కానీ వాటి వల్ల రాని గుర్తింపు ఐటెంసాంగ్స్‌తోనే వచ్చింది. ఐటెంసాంగ్స్ చేస్తే వచ్చే కిక్కే వేరు. పాట కోసం వేసే సెట్టింగులు, ఆ మ్యూజిక్ వింటూంటేనే చెప్పలేనంత ఉత్సాహం వచ్చేస్తుంది. సినిమాలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ చేసినా రానంత పేరు ఓ ఐటెంసాంగ్‌తో వస్తుంది. సినిమా ఆడొచ్చు. ఆడకపోవచ్చు. కానీ కొన్ని పాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.