రెండున్నర నెలల బాబును వదిలి బిగ్‌బాస్‌ హౌజ్‌లోనా?: లాస్య

బుధవారం, 26 జూన్ 2019 (10:31 IST)
యాంకర్ రవితో బుల్లితెరను పంచుకుని అతి తక్కువ సమయంలోనే టాప్ యాంకర్ లిస్ట్‌లో చేరిన లాస్య.. ఆపై పెళ్ళికి తర్వాత యాంకరింగ్‌కు దూరమైపోయింది.


ఈ మధ్యకాలంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న లాస్యని బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా చేయమని మాటీవీ యాజమాన్యం కోరిందని.. దీనికి లాస్య కూడా అంగీకరించిందని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై లాస్య స్పందించింది. 
 
బిగ్ బాస్ మూడో సీజన్ కోసం తన ఎంపిక జరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా తన స్నేహితులు, బంధువులు తనకు కాల్ చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని లాస్య చెప్పుకొచ్చింది. 
 
ఇంకా తనకు రెండున్నర నెలల బాబు వున్నాడని లాస్య గుర్తు చేసింది. అందుచేత ఈసారికి బిగ్ బాస్ చేసే ఆలోచనలేదు. మరెప్పుడైనా అవకాశం వస్తే అప్పుడు చూద్దామని లాస్య క్లారిటీ ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు