‘సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజా హేగ్డే నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ గతంలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సెకండ్ లుక్ రిలీజ్ చేసారు.
సూట్‌లో అలా స్టైలిష్‌గా మహేష్ నడుస్తూ ఉండగా.. పక్కన ఉన్నవారు గొడుగు పట్టుకుని ఉన్న ఈ లుక్ ప్రిన్స్ అభిమానులకు మంచి కిక్కిచ్చేలా ఉంది. స్టూడెంట్‌గా కాలేజ్‌లో నడుస్తు వచ్చిన టీజర్‌లో మహేష్ గడ్డంతో ఉండగా, ఈ లుక్‌లో పవర్‌ఫుల్ బిజినెస్‌మెన్‌లా కనిపిస్తున్నాడు. అల్లరి నరేష్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.