సంక్రాంతికి ఫస్ట్ ఛాయిస్ గుంటూరు కారం అంటున్న నిర్మాత

బుధవారం, 1 నవంబరు 2023 (12:56 IST)
Gutukaram latest poster
మహేష్‌బాబు నటిస్తున్న గుంటూరు కారం విడుదల తేదీని చిత్ర నిర్మాత నాగవంశీ నేడు ప్రకటించారు. జనవరి 13 , 2024 అని పోస్టర్ ను విడుదల చేశారు. అంతేకాకుండా సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా గుంటూరు కారం ఫస్ట్ ఛాయిస్ కదా? అని నిర్మాత  నాగవంశీ కోట్ చేశాడు. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
 
మాస్ యాక్షన్ సినిమా గుంటూరు కారం రూపొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన దైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా చిత్రించారు. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ 80 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ సినిమాకు థమన్‌ సంగీతం సమకూర్చారు. గుంటూరు కారం చాలా హాట్‌ గురూ అనిపిస్తుందేమో చూడాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు