ఈసారి సంక్రాంతికి పెద్ద సినిమాలు కేవలం రెండే ప్రేక్షకులను అలరించనున్నాయి. ఆర్.ఆర్.ఆర్., భీమ్లానాయక్, సర్కారువారి పాట, రాధేశ్యామ్, ఎఫ్ 3 సినిమాలు విడుదల కావాల్సి వుంది. కానీ పలు కారణాల వల్ల కేవలం రెండే సినిమాలు విడుదలవుతున్నాయి.
అసలు ఎందుకు ఆగాల్సివచ్చింది? అనే దానిపై దిల్ రాజు ఈరోజు క్లారిటీ ఇచ్చారు. ఆర్.ఆర్.ఆర్. సినిమా పెద్ద సినిమా. మూడేళ్ళుగా కష్టపడి పలు భాషల్లో విడుదలకు ప్లాన్ చేశారు. ఆ సినిమా సంక్రాంతి 7న విడుదలకు సిద్ధం చేశారు. అదేవిధంగా రాధేశ్యామ్ కూడా చాలా కాలం షూటింగ్ జరిగింది. అది కూడా పాన్ ఇండియా మూవీనే. అగ్ర హీరో. ఈ రెండు సినిమాలు ఏవిధంగా విడుదల కావాలని దర్శక నిర్మాతలు ఛాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగిన అత్యవసర సమావేశంలో అడగడంతో మిగిలిన సినిమాలు వాయిదా వేసుకున్నాయి.
- పైగా థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్న తరుణంలో కరోనా థార్డ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా థియేటర్లు అన్ని సినిమాలు అందుబాటులో లేవు. ఆర్.ఆర్.ఆర్. సినిమా, రాథేశ్యామ్ సినిమాలు దాదాపు అన్ని థియేటర్లను ఆక్యుపై చేసేశాయి. ఇలాంటి తరుణంలో మిగిలిన సినిమాలు విడుదల కావడం కరెక్ట్ కాదు. థియేటర్ల కొరత వుంది అంటూ దిల్ రాజు పూర్తి క్లారిటీ ఇచ్చారు.
- కాగా, ఈ సమయంలో దర్శకుడు రాజమౌళి, మహేష్, పవన్ అలాగే నిర్మాత దిల్ రాజులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.