ఇంతకు ముందు శ్రీదేవి, మొన్న కాంచన 'బాహుబలి'లో వచ్చిన ఆఫర్స్ వదులుకున్నారని తెలుస్తుంది. తాజాగా 'బాహుబలి'లో వచ్చిన ఆఫర్ మంచు లక్ష్మి ఎందుకు వదిలేసుకుందో చెప్పింది. మంచు లక్ష్మి ఒక టీవీ ప్రోగ్రాంలో మాట్లాడుతూ 'బాహుబలి'లో నాకు శివగామి రోల్ చేయమని ఆఫర్ వచ్చిందని, ప్రభాస్‌కి అమ్మగా చెయ్యడం ఇష్టంలేకే వదిలేసుకున్నానని అన్నారు. ప్రభాస్‌ని చూస్తే ఎవరికైనా కొడుకు ఫీలింగ్ వస్తుందా? నాకైతే అలాంటి ఫీలింగ్ రాదని, పైగా ఇంకేదో ఫీలింగ్ కూడా రావొచ్చని చెప్పింది.