తాను తన తండ్రి ఆస్తుల కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని, తన ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం చేస్తున్నట్టు హీరో మంచు మనోజ్ అన్నారు. తన తండ్రి మోహన్ బాబుకు తనకు మధ్య తలెత్తిన వివాదంపై ఆయన మంగళవారం మరోమారు స్పందించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆస్తి కోసమో డబ్బు కోసమో తాను ఈ పోరాటం చేయడం లేదన్నారు. ఆత్మగౌరవం కోసం, తన భార్య, పిల్లల రక్షణ కోసం చేస్తున్న పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే పారిపోయారన్నారు. తనను తొక్కేయడానికి తన భార్య, పిల్లలను వివాదంలోకి లాగుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం : డాక్టర్ మోహన్ బాబు
తమ కుటుంబంలో చెలరేగిన వివాదంపై సీనియర్ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు స్పందించారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని అన్నారు. ఇది తమ కుటుంబంలో జరుగుతున్న చిన్న తగాదా అని పేర్కొన్నారు. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారని, గతంలో తాను ఎన్నో కుటుంబాల్లో జరిగిన గొడవలను పరిష్కరించి ఒక్కటి చేసినట్టు ఆయన చెప్పారు.
మరోవైపు, ఆయన పెద్ద కుమారుడు, సినీ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా మంగళవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. మంచు కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని భూతద్దంలో చూపించి పెద్దగా చిత్రీకరించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మా ఫ్యామిలీలో చెలరేగిన అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సీనియర్ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన వివాదం ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మంచు మనోజ్‌లు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మంచు మనోజ్, మంచు మోహన్ బాబుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడి షరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులను నమోదు చేశారు.
మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్, ఈయన భార్య మంచు మౌనిక రెడ్డిలపై పోలీసులు 329, 351 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే, మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు అనుచరులపై కూడా 329, 351, 115 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ వివాదంపై డాక్టర్ మోహన్ బాబు కూడా స్పందించారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని, ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది, పరిష్కరించుకుంటామన్నారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు పరిష్కరించి, అందరూ కలిసివుండేలా చేశానని చెప్పారు. పైగా, అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని చెప్పారు.
ఆస్తి కోసమో డబ్బు కోసమో నేను ఈ పోరాటం చేయడం లేదు : మంచు మనోజ్
ఆత్మగౌరవం కోసం, నా భార్య, పిల్లల రక్షణ కోసం చేస్తున్న పోరాటం
రక్షణ కల్పించాల్సిన పోలీసులే పారిపోయారు
నన్ను తొక్కేయడానికి నా భార్య, పిల్లలను లాగుతున్నారు