సరైనవాడు లేకనే మీరు వచ్చారా!
ప్రకాష్‌రాజ్ నుద్దేశించి ప్రసంగం అంతా జరిగింది. ఇటీవల ప్రకాష్‌రాజ్ మాట్లాడిన మాటలు నన్ను బాధించాయి. తెలుగువారినెవరినైనా భాధిస్తాయి. తెలుగు సంఘంలో సరైనవాడు లేకపోవడంతో నేను పోటీకి వచ్చానని ప్రకాష్‌రాజ్ అనడంలో అర్థం ఏమిటి? కోటి రతనాల సీమ రాయలసీమ, కోటి రత్నాల వీణ తెలంగాణ, అందరిభందువు అయిన ఆంద్రలో ఎవరూ లేరనే మీ ఉద్దేశ్యమా? ఎన్.టి.ఆర్. రక్తం మాలో లేదా?
పాలించేది స్థానియకులే
నటుడిగా ఎవరికైనా ఏ భాషలోనైనా నటించవచ్చు. కానీ పాలించేది స్థానికులే. ధక్షిణాది ఇతర భాషల్లో నేను కూడా సభ్యడినే. నేను అక్కడ పోటీచేసి పాలిస్తానంటే కుదరదు. మీరు ఎందుకు అక్కడ నిలబడి గెలవలేదు. మీరు తెలంగాణాలో ఓ గ్రామాన్ని దత్తత చేసుకున్నారు. కానీ నేను కొన్ని గ్రామాలనే దత్తత తీసుకున్నాను. 11వేల మంది రిజిష్టర్ కళాకారులకు గుర్తింపు కార్డులు ప్రభుత్వ తరఫున ఇచ్చాను. కొంతమంది పిల్లలను చదివిస్తున్నాను. `మా`లో అధ్యక్షుడి అయ్యాక పేద కళాకారులకోసం ఫించన్లు, ప్రభుత్వం పరంగా కళ్యాణలక్ష్మీ, ఇండ్ల స్థలాల కోసం వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడాను. మరి ఆ పని చేశారా? అసలు మీకు ఈ విషయాలు తెలుసా? మరి కళాకారుల పిల్లల్ని ఎందుకు దత్తత చేసుకోలేదు. ఉన్నట్టుండి `మా`పై ఎందుకు మీకు ప్రేమ కలిగింది. మీరే వచ్చారా? ఎవరైనా తీసుకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు.
అందుకే సభ్యులైనా ఓటర్లలారా మీకు నేను చేసే విన్నపం ఒక్కటే. ఏదోఒక పేనల్‌ను గెలిపించండి. అదికూడా కళాకారులకు సేవచేసేది అయివుండాలి. అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఈ మూడు పోస్టులు సరైనవారిని గెలిపిస్తేనే అసోసియేషన్ ముందుకు వెళుతుంది. ఇక్కడ ఓ విషయం ప్రకాష్‌రాజ్‌ను అడుగతున్నాను.