"శతమానం భవతి"లో నేను చేయడం లేదు: మెహరీన్

సోమవారం, 18 ఏప్రియల్ 2016 (18:36 IST)
రాజ్ తరుణ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కనున్న "శతమానం భవతి" చిత్రంలో కథానాయికగా "కృష్ణగాడి వీరప్రేమగాథ" ఫేమ్ మెహరీన్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, అసలు తనను ఆ సినిమా గురించి ఎవరూ ఎంక్వైరీ కూడా చేయలేదని మెహరీన్ స్పష్టం చేసింది. 
 
ప్రస్తుతం తాను హిందీలో అనుష్క శర్మ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న సినిమా, తెలుగులో సాయిధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాలు మాత్రమే అంగీకరించానని.. ఇంకొన్ని కథలు వింటున్నానని ఈ సందర్భంగా మెహరీన్ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి