బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్స. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలలకు సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి. మంగళవారం ఈ సినిమా నుంచి `హే చెలి..` అనే ఆహ్లాదకరమైన మెలోడీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మనసుని తాకే చల్లటి చిరుగాలిగా పాట అనిపిస్తుంది. విజువల్స్ ఆ ట్యూన్‌ను అనుగుణంగా అద్భుతంగా ఉన్నాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని పాటను శ్రీమణి రాశారు.