నా ఫేవరెట్ హీరో చిరంజీవి... చాలా అందంగా ఉంటారు.. కాజల్ అగర్వాల్

ఆదివారం, 22 జనవరి 2017 (15:49 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్ 150లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్న నటి కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ ఇపుడు చాలా ఖుషీగా ఉంది. దీనికి కారణం.. ఖైదీ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడమే. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘మెగాస్టార్ చిరంజీవి స‌ర్ చాలా అందంగా ఉంటారు.. చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు.. ఎంతో నిబ‌ద్ధ‌త‌తో, చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తార‌ు’ అని చెప్పుకొచ్చింది.
 
అంతేనా... తన పేవరేట్ హీరో చిరంజీవి అని వ్యాఖ్యానించింది. ఈ చిత్రంలో "అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు" పాట‌లో చిరు, చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి ఒకేసారి డ్యాన్స్ వేయ‌డం ఎంతో మంచి అనుభ‌వాన్ని ఇచ్చిందని తెలిపింది. ఇక‌ బ‌న్నీ అల్లు అర్జున్‌కి ఎంతో ఎన‌ర్జీ ఉంటుంద‌ని తెలిపింది. ఇప్పుడున్న హీరోయిన్స్‌ల‌లో ఎవ‌రూ ఎవ‌రికీ కాంపిటిష‌న్ కాదని ఆమె తెలిపింది.
 
త‌న‌కు తానే కాంపిటేష‌న్‌గా భావిస్తాన‌ని ఇంత‌కు ముందు న‌టించిన సినిమా క‌న్నా మంచిగా న‌టించాల‌ని అనుకుంటాన‌ని కాజల్ అంది. హార్డ్ వ‌ర్క్ చేయ‌డ‌మే త‌న స‌క్సెస్ సీక్రెట్ అని చెప్పింది. త‌న గ్లామ‌ర్ సీక్రెట్ ఖాళీ స‌మ‌యం దొరికిన‌ప్పుడు హాయిగా నిద్ర‌పోవ‌డ‌మేన‌ని తెలిపింది. శాత‌కర్ణి, చిరు ఖైదీ.. రెండు సినిమాలూ హిట్ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి