ఇది ఆర్గాన్ హార్వెస్టింగ్ మాఫియా నేపథ్యంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్, స్కిన్ మాఫియా నుంచి పొంచి ఉన్న ప్రమాదం గురించి ప్రేక్షకులకు అవగాహన కల్పించేలా ఈ చిత్రం రూపొందుతోంది. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని హన్సిక చెప్పింది.
థ్రిల్లర్‌లను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. స్కిన్ మాఫియా ముప్పును స్పృశించే డార్క్ థ్రిల్లర్ ఇది. ఈ నేపథ్యంలో సినిమా చేయడం ఇదే తొలిసారి. నా పాత్ర ఓ ఉచ్చులో పడుతుంది. శృతి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆమె తనకు తానుగా బయట పడిందా లేదా అనేది మీరే గుర్తించాలి. ఈ సినిమాలో ఒక పోరాట యోధురాలుగా, ఆత్మవిశ్వాసం వున్న మహిళా, ఆమెకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్ళేదిశంగా వుంటుంది.
నేను తమిళంలో సినిమాలు చేస్తున్నా. అందుకే తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది. నా కెరీర్‌లో ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదు. నేను సంతృప్తిగా ఉన్నప్పటికీ, నేను మరింతగా సాధించాలనుకుంటున్నాను. నటిగా నేను ఇంకా సంతృప్తి చెందలేదు. నేను చాలా సినిమాలు చేయాలి.
నా కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్, ప్రభాస్‌తో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నాను. వారి సినిమాలు భాషాపరమైన అడ్డంకులను తుడిచిపెట్టాయి. వారు స్టార్స్ గా ఎదిగినా ఎప్పటిలాగే వినయంగా ఉంటారు అని తెలిపింది.