అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు పెంచేశారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు మేకర్లు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ బాగుందని, అందరినీ మెప్పించేలా ఉందని ప్రశంసించారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఇక ఈ మోషన్ పోస్టర్‌లో సంగీతం, ఆర్ఆర్ వినసొంపుగా ఉంది. చూస్తుంటే.. ఈ సినిమాలో అందమైన ప్రేమ కథను తెరపై ఆవిష్కరించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలెట్ అవ్వనున్నట్టుగా కనిపిస్తోంది. వాసు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఉద్దవ్ ఎస్ బి ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్లు ప్రకటించనున్నారు.
నటీ నటులు: తేజ బొమ్మ దేవర, రిషిక లోక్రే, జయ ప్రకాష్, శైలజా ప్రియ, మెకా రామకృష్ణ, నవీన్ నేని, రవి శివ తేజ, మాస్టర్ అజయ్, అంజలి, శ్రీ లత తదితరులు