ఈ చిత్రానికి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్ ని సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వ్యాన్ వెనుక కూర్చుని ఇంటెన్స్ లుక్ తో ఫెరోషియస్ అవతార్ లో కనిపించారు. అతని నుదిటిపై రక్తంతో కూడిన "మూడు గోవింద నామాలు", చేతులపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. వ్యాన్ పై వున్న స్టిక్కర్ ""Hyderabad" లో "BAD" అనే పదాన్ని తొలగించడం అతని పాత్ర దూకుడు స్వభావాన్ని, యాక్షన్-ప్యాక్డ్ స్టయిల్ ని సూచిస్తుంది.
ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తున్నారు. సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకు కమ్ బ్యాక్ ఇస్తూ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ కాగ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ
సాంకేతిక సిబ్బంది: డీవోపీ: రసూల్ ఎల్లోర్, సంగీతం: హారిస్ జైరాజ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్- సుప్రీమ్ సుందర్, పృధ్వి, కొరియోగ్రాఫర్స్: రాజు సుందరం, శోబి మాస్టర్, విజయ్ పొలంకి, శిరీష్, లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్