అధ్యక్ష పీఠంపై డోనాల్డ్ ట్రంప్ - అక్రమ చొరబాటుదారుల వెన్నులో వణుకు

ఠాగూర్

మంగళవారం, 21 జనవరి 2025 (14:30 IST)
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టడంతో అక్రమ చొరబాటుదారుల వెన్నులో వణుకు మొదలైంది. దీంతో గుట్టుచప్పుడుకాకుండా అమెరికాను వీడేందుకు సిద్ధమైపోతున్నారు. సరైన పత్రాలు లేకుండా ఇన్నాళ్లు దేశంలో ఉన్న వాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
 
అమెరికాలో పుట్టడంతో పౌరసత్వం పొందిన తమ పిల్లల బాధ్యతలను సంరక్షకులకు అప్పగించి పెట్టెబేదా సర్దుకుంటున్నారు. ఇలాంటి వారికి నోరా సానిడ్‌లో వంటి సామాజిక కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్లు, మెడికల్, స్కూలు రికార్డులను పిల్లల వద్ద ఉంచాలని సూచిస్తున్నారు.
 
ప్రవాసులకు స్వర్గధామమైన షికాగోలో చొరబాటుదారులపై ఈ వారం చర్యలు తీసుకోబోతున్నారన్న వార్త అక్కడి ప్రవాసుల్లో కలకలం రేపింది. పలువురు ప్రవాసులు షికాగోలో ఇళ్లు కొనుక్కుని స్థిరపడ్డారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన నెలకొంది. మరోవైపు, దేశంలో అక్రమంగా ఉంటున్న ప్రవాసులపై చర్యలు తప్పవని ట్రంప్ మద్దతుదారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారిచేస్తున్న విషయం తెల్సిందే. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు