నందమూరి బాలక్రిష్ణ వారసుడు నందమూరి మోక్షజ్న సినిమా హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు? అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొనేది. బాలక్రిష్ణ కూడా పలు సందర్భాల్లో నటన ఇష్టంలేదని అంటున్నాడని చెప్పాడు. కొంతకాలానికి చదువు అయ్యాక చూద్దాం అన్నారు. ఇక నేటితో ఆ మాటలకు ఫుల్ స్టాప్ పడింది. ఎక్స్ (ట్విట్టర్)లో నందమూరి బాలక్రిష్ణ నే వారసుడు వస్తున్నాడు..అంటూ పోస్ట్ చేశాడు. కొద్ది సేపటికే నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్ చేస్తూ ఓ ఫొటోను కూడా పెట్టాడు.