ఇంతకీ మేటర్ ఏంటంటే... నేను మోటరు బోటు కొనుక్కోవాలనుకుంటున్నాను. దయచేసి సలహా ఇవ్వండి అన్నాడు. అంతే... హైదరాబాద్‌లో వర్షాల వలన జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే.. నువ్వు ఇలా జోకులు వేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. విషయం సీరియస్ అవుతుండటాన్ని గమనించిన బ్రహ్మాజీ హైదరాబాద్ వరదల్లో తన ఇల్లు కూడా మునిగిందని తెలిపాడు.
బ్రహ్మాజీ ఈ మేరకు తన ఇంటి ఫొటోలు.. ఇంటి ముందర మునిగిన కార్ల ఫొటోలను షేర్ చేశాడు. అయినా నెటిజన్లు ఊరుకోలేదు. కొంతమంది అయితే... హైదరబాద్‌ని విమర్శించే వాళ్లకి ఇక్కడే ఉండే అర్హత లేదంటూ కాస్త సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రలో, చెన్నైలో వరదలు వస్తే... సాయం చేస్తారు. హైదరాబాద్‌లో వర్షాలు పడుతుంటే.. ఇలా కామెడీ చేస్తారా అని నిలదీస్తున్నారు.