కీరవాణి శిబిరం నుంచి తదుపరి సంగీత దర్శక వారసత్వం మొదలైందా.. అంటే అవుననే చెప్పాలి. కీరవాణి ఇద్దరు పుత్రులు సింహ కోడూరి, కాల భైరవ ఇటీవలే సోషల్ మీడియాలో ప్రవేశించారు. బాహుబలి సినిమాలో రెండు పాటలను కాలభైరవ స్వయంగా పాడినట్లు తెలుస్తోంది. అంటే కీరవాణి కుటుంబం కుటుంబం మొత్తం బాహుబలితో కనెక్ట్ అయినట్లే. కీరవాణి ఈ సినిమాలో రెండు పాటలు రాయగా ఆయన తండ్రి, పాటల రచయిత కూడా మరొక పాటల రచయితతో కలిసి ఒక పాట రాశారు.
ఏం ప్యామిలీ అనుకోవాలి. ఫ్యామిలీ ఫ్యామిలీ టిపిన్ తినే బతికేస్తున్నారా నాన్నా అంటూ మహేష్ పోకిరి సినిమాలో జోక్ పేల్చినట్లు కుటుంబం కుటుంబమే సినిమా వ్యాపారంలో దిగిపోయిందేమిటి అని జనం నోళ్లు నొక్కుకుంటున్నారు. ఎఁత వారసత్వం అనుకున్నప్పటికీ రాజమౌళి, కీరవాణి ఇస్తున్న నాణ్యతను ఎవరూ తప్పుపట్టలేరు. వీరీ వారసులు కూడా విరీకోవలోనే సాగాలని ఆశిద్దాం.