నిఖిల్ స్పై నాన్-థియేట్రికల్ హక్కులు 40 కోట్లకు అమ్ముడయ్యాయని నిర్మాణ సంస్థ ప్రకటనలో తెలిపింది. పూర్తి యాక్షన్తో కూడిన గూఢచారి థ్రిల్లర్గా రూపొందుతున్న స్పైలో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, హాలీవుడ్ టెక్నీషియన్ జూలియన్ అమరు ఎస్ట్రాడా సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి కథ అందించిన కె రాజ శేఖర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలో అభినవ్ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వేసవిలో థియేటర్లలోకి వస్తుందని తెలియజేసారు.