హీరో నితిన్, హీరోయిన్ రాశి ఖన్నాలు పెళ్లిపీటలెక్కారు. నిజజీవితంలో మాత్రం కాదండోయ్. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు "శ్రీనివాస కళ్యాణం" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా, రెండో షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. వచ్చేనెల 17వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ చండీఘర్‌లో జరగనుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను, జూలై 24వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.