#NTR30-2021 సమ్మర్ రిలీజ్.. త్రివిక్రమ్‌-ఎన్టీఆర్ కాంబోలో?

గురువారం, 20 ఫిబ్రవరి 2020 (12:23 IST)
NTR Jr And Trivikram
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో #NTR30 సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలోపు ప్రారంభమయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే తివిక్రమ్ కాంబోలో ఎన్టీఆర్ సినిమా రాబోతోందని తెలిపే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రం హారికా అండ్ హాసిని, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కనుంది. 
 
ఈ సినిమాకు చినబాబు, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజైంది. ఇక నటీనటుల వివరాలు త్వరలో విడుదల అవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు