మీటూపై మాట్లాడాలంటే ధైర్యం కావాలంటూ తమిళ నటి ఓవియా ట్వీట్ చేసింది. హెలెన్ నెల్సన్ ఈమె అసలు పేరు. కానీ సినిమా పేరు ఓవియా. తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది. ఆమె తమిళ సినిమా `కలవాని` రెండు భాగాల్లో నటించింది. మొదటి భాగం పేరు రాలేదు. రెండోదికూడా ఈమధ్యనే విడుదలైంది. అది కూడా ఆదరణ చూడగొనలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టింది. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. పైగా బుల్లితెరపైనే అందాలు ఆరబోసింది.