కాటమరాయుడు టీజర్ రిలీజ్ వాయిదా.. కానీ పోస్టర్ రిలీజైంది.. మాస్ లుక్ అదుర్స్

శుక్రవారం, 13 జనవరి 2017 (19:25 IST)
పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'కు చెందిన పవన్ పోస్టర్ రిలీజైంది. ఈ సినిమా శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. కిషోర్‌కుమార్‌ పార్థసానీ(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పవన్‌ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఎడ్లబండి కాడిపై కాలుపెట్టి, చేతిలో కండువా పట్టుకుని నిలబడి ఉన్న పవన్‌ మాస్‌లుక్‌ను విడుదల చేసింది. 
 
నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్న 'కాటమరాయుడు'ను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మాస్ లుక్‌పై పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా.. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగినా.. కేవలం మోషన్ పోస్టర్ తోనే సరిపెట్టేశారు చిత్రయూనిట్. ఆ తరువాత సంక్రాంతి కానుకగా తొలి టీజర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి టీజర్ లాంచ్ వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కాటమరాయుడు టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి