కార్తికేయ-2, ధమాకా వంటి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. నాలుగు పాటలు, నేపథ్య సంగీతం కళ్యాణి మాలిక్ అందించగా.. ఒక పాట వివేక్ సాగర్ స్వరపరచడం విశేషం. కళ్యాణి మాలిక్ స్వరపరిచిన పాటల్లో ఇప్పటికే మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'కనుల చాటు మేఘమా' పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన 'కఫీఫీ' పాట విడుదలైంది.