పోర్న్ వీడియోల చిత్రీకరణ కేసు : శిల్పా శెట్టి భర్త అరెస్టు

మంగళవారం, 20 జులై 2021 (08:00 IST)
నీలి చిత్రాలను చిత్రీకరించినందుకుగాను బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఓ బడా పారిశ్రామికవేత్త కావడం గమనార్హం. 
 
సోమవారం రాత్రి రాజ్‌ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోర్న్‌ వీడియోలను చిత్రీకరించి కొన్ని మొబైల్‌ యాప్స్‌ ద్వారా ప్రసారం చేస్తున్నార్న ఆరోపణలతో రాజ్‌ కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
దీనికి సంబంధించి పోలీసుల వద్ద కీలక ఆదారాలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను రాబట్టడానికే రాజ్‌ కుంద్రాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు