ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ఏంటంటే.. కేరళ నటి ప్రియా వారియర్ ''ఒరు అడార్ లవ్'' అనే చిత్రంతో ఆమె సినీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలోని ఓ పాటకు ఆమె కన్నులతో చేసే సైగ కుర్రకారును ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె చేసే ఎక్స్ప్రెషన్ యూత్‌ను కట్టిపడేసింది. అయితే ఈ సినిమా ఎక్స్‌ప్రెషనే ప్రియా వారియర్‌కు ఇక్కట్లు తెచ్చిపెట్టింది.