అసలే వాలెంటైన్స్ డే. ఈ నేపథ్యంలో ఓ టీనేజ్ గర్ల్ ఇంటర్నెట్టులో కన్నుగీటుతూ హీటెక్కించేస్తోంది. రాత్రికి రాత్రే ఆమె నేషనల్ లెవల్లో సెలిబ్రిటీ అయిపోయింది. ఆమె పేరే ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది. ఓ విషయం తెలుసా... ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫోలోవర్ల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది.