పూజలు చేస్తున్న పూరీ బ్రదర్స్... ఎందుకంటే...?

సోమవారం, 28 నవంబరు 2016 (21:45 IST)
మాస్‌ చిత్రాలకు ఆలవాలంగా ఎదిగిన పూరీ జగన్నాథ్‌కు ప్రస్తుతం విజయాలు ఎండమావిగా మారాయి. గతంలో ఇడియట్‌, పోకిరి వంటి బ్లాక్‌‌బస్టర్స్‌ ఇచ్చిన ఆయన జ్యోతిలక్ష్మి.. వంటి సినిమాలతో వెనుకబడిపోయాడు. కళ్యాణ్‌రామ్‌తో సినిమా చేసినా అది పెద్దగా లాభం లేకుండా పోయింది. పూరీ చెప్పిన 'ఇజం' జనాలకు పెద్దగా ఎక్కలేదు. ఆ తర్వాత స్వంత నిర్మాణ సంస్థలో చిన్న చిత్రాలు తీస్తానని ప్రకటించాడు. 
 
ప్రస్తుతం ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదిలావుంటే.. ఆయన సోదరుడు సాయిరామ్‌ శంకర్‌ హీరోగా నిలదొక్కు కోవడానికి చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఎంతగా పోరాడినప్పటికీ అదృష్టం కలిసిరాలేదు. తాజాగా నికిషా పటేల్‌తో 'అరకు రోడ్‌లో' సినిమా చేశాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఈ చిత్ర విజయం కోసం సాయిరామ్‌ శంకర్‌ తహతహలాడుతున్నారు. అయితే అన్నదమ్ములిద్దరూ తమ సక్సెస్‌ల కోసం ఇటీవలే పూజలు నిర్వహించారని తెలిసింది. మరి వారిని ప్రేక్షకులు పట్టించుకుంటారో లేదో చూద్దాం.

వెబ్దునియా పై చదవండి