డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం గద్దలకొండ గణేష్. మెగా హీరో వరుణ్ తేజ్ - పూజా హేగ్డే కాంబినేషన్ లో రూపొందిన ఈ భారీ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. సెకండ్ వీక్ సరైన సినిమా లేకపోవడంతో గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద మరింతగా కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అనుకున్నారు. అయితే... ఊహించని విధంగా పూరి.. హరీష్ శంకర్ కి షాక్ ఇచ్చాడు.
ఇంతకీ ఏం చేసాడంటే.. ఈ నెల 28న డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పుట్టిన రోజు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బష్టర్ అయ్యింది. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ రూ.75కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.