ఇక ఈ సినిమాను ఎవరు బాయ్ కాట్ చేయలేరు అని , ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి 2023 జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుందని ప్రభాష్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదండోయ్.. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఆదిపురుష్ చిత్రానికి మద్దతు ప్రకటించింది. ఎంఎన్ఎస్ పార్టీ నేత, సినీ నిర్మాత అమేయ ఖోప్కార్ దీనిపై స్పందించారు.
"దర్శకుడు ఓం రౌత్‌కు, ఆదిపురుష్ చిత్రానికి మేం మద్దతు ఇస్తున్నాం. ఈ సినిమా ఎలా విడుదలవుతుందో చూస్తామని మీరు (బీజేపీ) అంటున్నారు... కానీ మహారాష్ట్రలో ఇలాంటి గూండాగిరీ చెల్లదు. ఆదిపురుష్ సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుంది... అందుకు మేం మద్దతుగా నిలుస్తాం. కేవలం టీజర్ చూసి ఈ సినిమాను ఆపేస్తామంటూ మీ చెత్త రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించడం నేర్చుకోండి.." అని హితవు పలికారు.