ఈ సినిమాలో తను సాయిపల్లవి కలిసి నటించనున్నామనీ, ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని రానా వెల్లడించాడు. ఇకపోతే, ఈ సినిమాకు విరాట పర్వం 1992 అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారు. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. ఇక ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్‌గా, సాయిపల్లవి నక్సలైట్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.