ఇద్దరు భామలను రఫ్ ఆడించిన రానా.. ఆ పత్రికకు చిక్కిన భళ్లాలదేవ..

గురువారం, 13 ఏప్రియల్ 2017 (15:37 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో దగ్గుబాటి రానా ఒకరు. రానా - శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన 'లీడర్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువహీరో.. 'బాహుబలి' చిత్రంలో భళ్లాలదేవగా నటించి జాతీయ స్థాయిలో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. 
 
ఇపుడు.. ఇద్దరు భామలను రఫ్ ఆడించారట. అలా చేస్త.. ఓ పత్రికకు పట్టుపడ్డాడు. ఆ పత్రిక పేరు మాక్సీమ్. పత్రిక కవర్ పేజీపై ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య స్టైల్‌గా కూర్చొని ఉన్న రానా పోస్టర్ దేశవ్యాప్తంగా మహిళా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నది.
 
అత్యంత ప్రజాదరణ ఉన్న మాక్సీమ్ మ్యాగజైన్ తాజాగా ఏప్రిల్ ఎడిషన్ ప్రత్యేక సంచికగా వెలువరించింది. ఆ పత్రిక కవర్ పేజీపై రాజసం ఉట్టిపడుతున్నట్టు ఇద్దరు అందాల భామల మధ్య కూర్చొని రానా దగ్గుబాటి ఫొటోను ప్రముఖంగా ప్రచురించింది.
 
తాజా సంచిక కవర్ పేజీని మాక్సీమ్ ట్వీట్టర్‌లోని తన ఖాతాలో షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. గ్రే కలర్ సూట్‌లో ఉన్న రానా లుక్‌కు, స్టైయిల్‌పై మంచి కామెంట్లు రావడం గమనార్హం.
 
కాగా, రానా నటించిన 'బాహుబలి ది కన్‌క్లూజన్' చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. బాహుబలి మొదటి భాగంలో భళ్లాలదేవ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్‌లో రాజమౌళి, ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణలు పాల్గొంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి