నటి రాశీ ఒకప్పుడు కథానాయికగా వెలుగు వెలిగింది. పలు విజయవంతమైన సినిమాలు చేసింది. వైవాహిక జీవితం తర్వాత సినిమాలు తగ్గించింది. కానీ ఆడపా దడపా ఏవైనా అవకాశాలు వస్తే చేస్తుండేది. అలా వచ్చిన అవకాశమే రంగమ్మత్త పాత్ర. రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన `రంగస్థలం` సినిమా తెలిసిందే. అందులో రంగమ్మత్త పాత్ర కోసం ముందుగా రాశిని అడిగారు. కథ మొత్తంగా విన్నది బాగా నచ్చింది. కానీ పాత్ర విషయంలో కొన్ని ఇబ్బందులు వున్నాయని వద్దనుకుంది.