మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలను లైనులో పెట్టారు. ప్రస్తుతం ఆయన "విశ్వంభర" చిత్రంలో ఆయన బీజీగా నటిస్తున్నారు. మరోవైపు, "దసరా" మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఒకపుడు తన అందచందాలతో బాలీవుడ్‌ను ఊపేసిన రాణీ ముఖర్జీ ఈ సినిమాలో నటిస్తున్న సమాచారం.