కలల సాకారం కోసం మహిళలు పోరాడాలంటున్న రాశీఖన్నా

బుధవారం, 8 మార్చి 2017 (18:40 IST)
మహిళలు తమ కలలను సాకారం చేసుకోవాలి. ఎందుకు సర్దుకుపోతారంటూ.. వారిని చైతన్యవంతుల్ని చేస్తూ మహిళాదినోత్సవం సందర్భంగా ఓ వీడియో చేసింది. బుధవారం మధ్యాహ్నాం దాన్ని విడుదల చేశారు. 'బిలీవ్‌ ఇన్‌ యు' పేరుతో రూపొందింది. ఈ వీడియోని రాశీఖన్నా స్వయంగా రూపొందించారు. ఈ వీడియో ద్వారా రాశీఖన్నా మహిళల గొప్పతనాన్ని చాలా అందంగా వివరించారు. 
 
ఇందులో 'ఎందుకు మీ కల పట్ల మీరు సర్దుకుపోతున్నారు, ఎందుకు ఓటమిని అంగీకరిస్తున్నారు, మీరు ఎవరితో పోరాడుతున్నారు..' అంటూ మహిళలను ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. రాశీఖన్నా ఈ వీడియోని తన ఫేస్‌ బుక్‌ పేజీ ద్వారా రిలీజ్‌ చేస్తూ 'ఈ వీడియోని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైంది. నా మొదటి వెంచర్‌ కూడా' అన్నారు. రెండు రోజుల క్రితం రాశీఖన్నా మహిళలను ఉద్దేశించి స్వయంగా రాసిన ఒక కవిత కూడా అందరినీ భలేగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి