ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది.
థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్ ఇచ్చేందుకు రమేష్ వర్మ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా..అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
సాంకేతిక బృందం: కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ, నిర్మాత: సత్యనారాయణ కోనేరు, సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు, స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు, డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్, ఎడిటర్: అమర్ రెడ్డి, లిరిక్స్: శ్రీ మణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.