పోలీసు పాత్ర‌తో న‌టుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి

గురువారం, 29 జులై 2021 (15:35 IST)
Venu ph
ఇంత‌కుముందు ఇద్ద‌రు ముగ్గురితో క‌లిసి న‌టుడిగా చేసి, ఆ త‌ర్వాత హీరోగా చేసిన వేణు తొట్టెంపూడి మ‌ర‌లా న‌టుడిగా మారారు. చెప్ప‌వే చిరుగాలి, స్వ‌యంవ‌రం, పెళ్ళాంతో ప‌నేంటి, ఖుషీఖుషీగా వంటి సినిమాల్లో న‌టించిన వేణు ఆ త‌ర్వాత స‌క్సెస్‌లు లేక‌పోవ‌డంతో సినిమారంగంనుంచి దూరంగా వున్నారు. ద‌ర్శ‌కుడు బి.గోపాల్ మేన‌ల్లుడు అయిన వేణు తొట్టెంపూడి వ్యాపార‌రంగ‌లో స్థిర‌ప‌డ్డారు. అలాంటి వేణు తాజాగా ర‌వితేజ సినిమాలో మ‌ర‌లా రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు.
 
శరత్ మందవ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌`రామారావు ఆన్ డ్యూటీ` చిత్రంలో ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వేణు న‌టిస్తున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. సినిమా గేప్ తీసుకోవ‌డానికి కార‌ణాన్ని ఓ సంద‌ర్భంగా ఇలా తెలియ‌జేశాడు. స‌రైన క‌థ‌లు, న‌న్ను కోరుకునేవారు లేక‌పోవ‌డంతో దూరంగా వున్నాన‌ని వెల్ల‌డించారు. ఇప్పుడు ర‌వితేజ సినిమాలో ఓ పాత్ర ఆయ‌న్ను కోరుకుంటూ వ‌చ్చింద‌న్న‌మాట‌. ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్, రవితేజ ప్రొడక్షన్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు