OTTలోకి సర్కారు వారి పాట: రూ.199 చెల్లించాల్సిందే

గురువారం, 2 జూన్ 2022 (17:30 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. 
 
ప‌ర‌శురామ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ మే 12న 'సర్కారు వారి పాట' థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తూ.. ఈ మూవీని ఈ రోజునే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.
 
ఇక అమెజాన్ ప్రైమ్‌ అకౌంట్ ఉన్న వాళ్లందరూ 'స‌ర్కారు వారి పాట‌'ను ఫ్రీగా చూసేందుకు వీల్లేదు. ఈ సినిమాను చూడాలంటే ఎవరైనా రూ.199 చెల్లించాల్సిందే. 
 
ఇటీవల విడుదల కేజీఎఫ్ 2 సినిమాను కూడా ఇలానే రెంటల్ విధానంలో ఓటీటీ నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అకౌంట్ హోల్టర్లకు అందుబాటులోకి వచ్చింది. 
 
ఇప్పుడు అదే తరహాలో 'సర్కారు వారి పాట' సినిమాను కూడా పే ఫర్ వ్యూ రెంటల్ అమెజాన్ ప్రైమ్‌‌లో రిలీజ్ చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు