రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు... ఇలా వరుస విజయాలతో దూసుకెళుతోన్న సక్సస్‌ఫుల్ హీరో శర్వానంద్. ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శర్వా తాజా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి 'పడిపడి లేచే మనసు' అనే టైటిల్ పెట్టారు.
ఈరోజు రిలీజ్ చేసిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇది కూడా మరో కవితాత్మకమైన ప్రేమకథ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌కతా, ముంబయిలో జరుగుతోంది. నేపాల్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ.. కుదరలేదు. శర్వానంద్ - సాయిపల్లవి జంట స్ర్కీన్‌పై చేసే ప్రేమ సందడితో యువతరాన్ని ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.