గత 15 రోజులుగా తాను వణికిపోతున్నానని ఓ రేర్ డిసీజ్ తన శరీరంలో ఉందని డాక్టర్లు తేల్చారని చెప్పాడు. తనకున్న రుగ్మతపై అభిమానులు ఎవరికి తోచినట్టు వారు ఊహించుకోవద్దని, మరో వారం పది రోజుల్లో ఈ రోగం గురించిన మొత్తం విషయాన్ని వెల్లడిస్తానని, తనకు మేలు కలగాలని దైవాన్ని ప్రార్థించాలని కోరారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాను కొన్నిసార్లు నిద్రలేవగానే దిగ్భ్రాంతి చెందే విషయాలు వినాల్సి వస్తుందని, కొంతకాలం నుంచి సస్పెన్స్ స్టోరీగా సాగిన తన జీవితంలో పెను మార్పు వచ్చిందన్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకునే తనకు అటువంటి వ్యాధే సోకిందని, ఈ రోగానికి తలవంచే పరిస్థితి లేదని, పోరాడి తీరుతానని ఇర్ఫాన్ ఖాన్ చెప్పాడు.