తన ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌ను వీక్షించడానికి షారూఖ్ మంగళవారం అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపును నమోదు చేసుకుంది. ఇంకా ఫైనల్‌కు చేరింది
అయితే అహ్మదాబాద్‌లో 45 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత మధ్య మ్యాచ్ చూసిన షారూఖ్ ఖాన్ డీ-హైడ్రేషన్‌కు లోనైయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం షారూఖ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఆసుపత్రి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆపై ఆయనను డిశ్చార్జ్ కూడా చేశారు. నటి జూహీ చావ్లా ఆసుపత్రిలో నటుడిని పరామర్శించారు.