బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

ఠాగూర్

బుధవారం, 2 ఏప్రియల్ 2025 (19:15 IST)
వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి మాట్లాడుతూ, ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారంటూ వ్యాఖ్యానించారు. 
 
బిల్లుపై విపక్ష పార్టీ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అందులోని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు. 1954లో తొలిసారి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. అది అప్రజాస్వామికం అని ఆనాడు ఏ ఒక్కరూ చెప్పలేదన్నారు. పార్లమెట్ ఉభయ సభ్యులతో కూడిన జేపీసీకి అభినందనలు. మొత్తం 284 మంది ప్రతినిధులు, 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు జేపీసీలో తమ వాదనలు వినిపించాయి. మేం బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేస్తే, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు. ఈ బిల్లు తీసుకునిరాకపోతే కొందరు పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటారు అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. 
 
అలాగే, వక్ఫ్ బిల్లు ముస్లిం సమజానికి చెందిన మత విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం లేదా విఘాతం కలిగించదని ఇది కేవలం ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయం మాత్రమే అని, ఈ బిల్లు మద్దతు ఇచ్చేవారు, వ్యతిరేకించేవారూ ఎప్పటికీ గుర్తుండిపోతారని, పేద ముస్లింలకు వక్ఫ్ ఆస్తులను ఉపయోగించాలని వారిని అలా వదిలివేయకూడదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు