షికారు సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది - నిర్మాత బాబ్జి

సోమవారం, 13 డిశెంబరు 2021 (19:28 IST)
babji, abhinav, Sai dhansika, bekkem and others
న‌లుగురు ప్ర‌ధాన పాత్ర‌ల‌తో రూపొందుతోన్న చిత్రం `షికారు`. బాబ్జీ నిర్మాత‌. హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ, కరోనా ఇబ్బందులు దాటుకొని షికారు సినిమా  పూర్తి చేసాం, షికారు టైటిల్  లాగానే సినిమా కూడా బాగా వచ్చింది, కచ్చితంగా అంద‌రికీ న‌చ్చ‌తుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ధన్సిక న‌ట‌న బాగుంది. నలుగురు యువ హీరోలు చాలా  బాగా చేసారు, సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది, జనవరి 26న మా సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.
 
ద‌ర్శ‌కుడు  హరి మాట్లాడుతూ ఒక చిన్న సినిమా ముందుకు రావాలి అంటే ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటి సినిమా ని డైరెక్ట్ చేయమని నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాబ్జిగారి కి  థాంక్స్,  ర‌చ‌యిత కరుణ్ నాకు నా సినిమా కి బ్యాక్ బోన్ అని చెప్పాలి, శేఖర్ చంద్ర సంగీతం స‌మ‌కూర్చారు. భాస్కర్ పట్ల మూడు సాంగ్స్ రాసారని తెలిపారు.
 
-బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రొడ్యూసర్ బాబ్జి ఆరువందల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసారు, సినిమా మీద వున్న ఆయనకున్న  జడ్జిమెంట్ ఆయనకున్న  పట్టు ఎవరికీ లేదు అని చెప్పాలి.ఈ సినిమా అంద‌రికీ విజ‌యాన్ని చేకూర్చాల‌ని కోరుకుంటున్నాన్నారు.
 
ఇంకా హీరోయిన్  సాయి ధన్సిక మ‌రో ప్రొడ్యూసర్ డి. ఏస్.  రావు, రైటర్ కరణ్,  హీరో అభినవ్, ధీరజ్, నవకాంత్, సుభాష్ కోరియోగ్రాఫేర్, కెమెరా  ప్రసాద్, తేజు మాట్లాడుతూ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు