పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని శ్రీరెడ్డి తిట్టడం... దీంతో ఈ వివాదం మరింత తీవ్రం అవ్వడం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు, మాధవీలత, హేమ... ఇలా చాలామంది సినీ ప్రముఖులు శ్రీరెడ్డి పైన ఫైర్ అయ్యారు. ఇదంతా తెలిసిందే. ఎవరు ఊహించని షాక్ ఏమిటంటే... పవన్‌ని శ్రీరెడ్డి తిడితే బాగా పాపులర్ అవుతావ్ అని వర్మ చెప్పారట. వర్మ చెప్పినట్టుగానే శ్రీరెడ్డి చేసిందట. పవన్ కళ్యాణ్ శత్రువు ఒకరు తనతో అలా తిట్టించారని యువనటి శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.
అయితే... ఆ శత్రువు ఎవరన్న విషయంపై స్పష్టత వచ్చింది. ఆ రోజు మీడియా ముందు ఉన్న శ్రీరెడ్డికి రామ్ గోపాల్ వర్మ ఓ మెసేజ్ చేశారని, ఆ మెసేజ్‌ను తాను చూశానని ఈ రోజు టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామాజిక కార్యకర్త సంధ్య తెలిపారు. శ్రీరెడ్డి ఇంటర్నేషనల్ స్టార్ అయిందని రామ్ గోపాల్ వర్మ చెబుతోన్న విషయం తెలిసిందే. సామాజిక కార్యకర్తలు సంధ్య, దేవిలు శ్రీరెడ్డికి మద్దతు తెలపాలని కూడా వర్మ అన్నారు.
అయితే... సంధ్య ఈ విషయాన్ని బయటపెట్టారు. శ్రీరెడ్డి ఆ పదం ఉపయోగించడం తప్పేనని సంధ్య అన్నారు. ఆమెతో అలా అనిపించిన రామ్ గోపాల్ వర్మ పైన ఇప్పుడు టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలని అన్నారు. ఇదిలా ఉంటే... వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... అవును.. నేనే శ్రీరెడ్డికి అలా చెప్పాను. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి, ఫ్యాన్స్‌కి సారీ అని చెప్పారు. మరి... ఇప్పుడు మెగా ఫ్యామిలీ & ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.