ట్రిపుల్ ఆర్ (ఆర్ఆర్ఆర్)నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్. ఈ చిత్రంలో నటిస్తున్న హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు బుల్లెట్‌పై వెళ్తున్న పిక్ ఒకటి తాజాగా రిలీజైంది. ఇది ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది.
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా నిర్మితమవుతుంది. ఇటీవల హైదరాబాద్ సారధి స్టూడియోస్‌లో తిరిగి చిత్రీకరణ పారంభమైంది. ముందుగా సెట్‌లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జాయిన్ కాగా ఆ తర్వాత కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జాయిన్ అయ్యాడు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకమపై డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.