రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' ఈ యేడాది విడుదల కాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్ లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్ తో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 5 ఎకరాల స్థలంలో సినిమా కోసం స్టువర్టుపురం గ్రామాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ బడ్జెట్ ను కేటాయించారు.