బుల్లితెర నటుడు, కమెడియన్, యాంకర్, మెజీషియన్ అయిన సుడిగాలి సుధీర్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సుడిగాలి సుధీర్.. కొద్ది నెలలుగా ఈటీవీ జబర్ధస్త్‌కు దూరమై స్టార్ మా, జీ ఇలా ఇతర టీవీ ఛానల్స్‌లో షోలు చేస్తూ ప్రజలను మెప్పిస్తున్నారు. ఇక బుల్లితెర నాట సుధీర్, రష్మి జోడీకి యూత్‌లో తెగ ఫాలోయింగ్ ఉందనే విషయం కూడా తెలిసిందే.